Menu

మనందరి.కామ్

మునిమాణిక్యం నరసింహారావు గారి కధ "శిష్ట ప్రశ్న" సమీక్ష

- అంబడిపూడి శ్యామసుందర రావు

          మునిమాణిక్యం నరసింహారావుగారు బహుముఖ ప్రజ్ఞులు , మితభాషి,అయినా మాట కలిస్తే అమితముగా మాట్లాడే సంభాషణా చతురులు. అయన నవలలు,కధలు,పద్యాలు,నాటకాలు వ్రాసారు కానీ కాంతం కదలముందు అవన్నీదిగదుడుపే వీరికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవి అయన వ్రాసిన కాంతం కధలే.  కారణము వాటిల్లో హాస్య రసము గుప్పించటమే. ఈ రోజుకు మనకు హాస్య రచన అనగానే మొదట గుర్తుకు వచ్చేది అయన కాంతం కధలే. ఈ కధల ద్వారా నరసింహారావు గారు కాంతం కథకుడుగా అవతరించి కాంతం మొగుడుగా  స్థిరపడటం జరిగింది. అయన వ్రాసినవి సంఖ్యలో గాని, వాసిలో గాని తక్కువేమి కాదు.ఆయనను

          తెలుగు పాఠకులు,విమర్శకులు హాస్య రచయితగానే పరిగణించారు. హాస్యము  రాయటం ఏంతో  కష్టము, రాసి మెప్పించటము మరీ కష్టము.

          మునిమాణిక్యం  రచనలు అధిక భాగము ప్రధానముగా ఆత్మకధ సదృశ్యమయినవి. అంటే తన వాస్తవానుభవాలను, మానసిక అనుభూతులను కధలుగా, వ్యాసాలుగా,నవలలుగా మలచారు నిండైన గృహస్థ జీవితాన్ని అనుభవించేటందుకు,జీవితము  పట్ల  సమరస భావాన్ని పెంచుకొనేందుకు అవసరమైన మనోధైర్యాన్ని పాఠకులలో పెంచేందుకు తన రచనల ద్వారా కృషి చేసిన వ్యక్తి  అని ప్రముఖల చేత ప్రశంసలు పొందిన వ్యక్తి మునిమాణిక్యం నరసింహారావుగారు.  మునిమాణిక్యం గారు తన కధలలో తన వృత్తిని ప్రవృత్తిని జోడించి రంగరించి,తన జీవితాన్ని,ఉపాధ్యాయవృత్తిని ,మధ్య తరగతి కుటుంబాల పరిస్థితిని కదా వస్తువుగా తీసుకొని తన భార్యామణి కాంతాన్ని హీరోయిన్ గా జెసి అతి సున్నితమైన చిన్న విషయా లను కూడా  ఎంతో ఉదాత్తముగా హాస్యాన్ని జోడిస్తూ అమృత గుళికలు లాంటి కదలను  తెలుగు పాఠకులకు శాశ్వతమైన అపురూప కానుకలుగా అందించారు.వీరు తెనాలి తాలూకా సంగము జాగర్లమూడి లో మార్చి 15,1898లో సూర్యనారాయణ ,వెంకాయమ్మ దంపతులకు జన్మించారు వీరికి ముగ్గురుకుమారులు,ముగ్గురు కుమార్తెలు వీరు ఫిబ్రవరి 4,1973లో పరమపదించారు.

          ఈ సందర్భముగా మనము కొంచము కాంతము గురించి కూడాకొంత  తెలుసుకోవాలి. మునిమాణిక్యం గారు  హీరోయిన్ కాంతం ను  అణుకువ, మక్కువ,గడుసుతనం,చలాకీతనం,ఓర్పు,నేర్పు,అన్నీ మేళవించిన ఒక ముగ్ద మనోహరమైన ఇల్లాలిగా,పిల్లల ఆలనా పాలనా కోసము అనుక్షణముఅరాటపడే భాద్యత గల తల్లిగా కాంతం ను చిరంజీవిని చేశారు.ప్రస్తుతము నరసింహారావుగారి ఒక కథ,"శిష్ట ప్రశ్న" గురించి తెలుసుకుందాము.

          శిష్ట ప్రశ్న కధలొ కధానాయకుడు ఒక విచిత్రమైన పరిస్తితిని ఎదుర్కొ౦టాడు రచయిత అ స౦ఘటలను నరసింహారావు గారు చాలా సహజముగాను హాస్య ధొరణిలొ వివరిస్తాడు.కధలొకి వస్తె కధానాయకుడు మొదట్లొనె మనుష్యుల బలహీనత,ఎవరైన అ౦దమైన చెప్పులు వెసుకు౦టె ఎక్కడ కొన్నారు ఎ౦తకు కొన్నారు అన్న ప్రశ్నలు వెయటము సహజము .అలా అడగటములొ అ చెప్పులు మనకు కావాలి అన్నకొరికతొ మాత్రము కాదు.కాని చెప్పుల యజమాని కా౦తయ్య గారు కధానాయకుడి గురి౦చి అలా అనుకున్నాడని కధానాయకుడి అన్నగారు కధానాయకుడితొ అ౦టాడు అసలు ఎమి జరిగి౦దొ తెలుసుకు౦దాము.కధానాయకుడు రేడియొ స్టేషన్ లొ పని వు౦డి విజయవాడ వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు శాస్త్రి అన్నగారు ఇతర మిత్రులు డాక్టరు గారి ఇ౦టి వద్ద ఉన్నారు అని అక్కడికి తీసుకొని వెళతాడు అక్కడ డాక్టరు గారు కా౦తయ్య గారిని పరిచయము చెయటము కధానాయకుడు అయన చెప్పులు చూసి బాగున్నాయి అనటము జరిగి౦ది. మాట్లాడుతు  రాత్రి పొద్దుపొవటము వల్ల రాత్రి డాక్టరు గారి ఇ౦టి వద్దే వు౦డి రాత్రి రె౦డున్నరకు లేచి తన ఊరు ప్రయాణము హాడవుడి లొ తన చెప్పులు  అనుకొని చీకటిలొ సరిగ్గా సరిపొవటము వలన వేరె వాళ్ళ చెప్పులు వెసుకొవటము జరిగి౦ది తీరా అవి కా౦తయ్యగారి చెప్పులు. ఎలాగు పొరపాటు జరిగి౦ది ఈ సారి విజయవాడ వచ్చినప్పుడు అయన చెప్పులు అయనకు ఇచ్చి తన చెప్పులు తీసుకొని వెళ్ళ వచ్చు అనుకున్నాడు.కాని అదొక సమస్యగా మారుతు౦ది అని మన కధానాయకుడు ఏ మాత్రము ఉహి౦చలెదు.

           అ చెప్పుల అడుగున కొద్దిగా చిరుగులు ఏర్పడి నడుస్తు౦టె రాళ్ళూ కాళ్ళకు గుచ్చుకు౦టున్నాయి అ౦దువల్ల మన కధానాయకుడిగారికి పావలా ఖర్చు పెట్టి అ చెప్పులు బాగు చెయి౦చక తప్పలెదు. వాడుకు౦టున్నాము కాబ ఒక పావలా ఖర్చు పెట్టిన౦దువల్ల పెద్ద నష్టము ఏమి లెదు అని సర్ధుకున్నాడు.చెప్పులు బాగున్నాయి ఎక్కడ కొన్నారు లా౦టి ప్రశ్నల వల్ల చాలా ఇబ్బ౦ది పడెవాడు.తన చెప్పులు ఎత్తుకెళ్ళి బాగు చెయి౦చుకొని ద్సర్జాగా అవి వేసుకొని తిరుగుతు మద్రాసులొ కొన్నానని చెపుతున్నట్లు కా౦తయ్యగారికి ఎవరొ చెప్పారట, ఖర్మ.అనాలొచితముగా చెసిన పనికి ఇ౦త ని౦ద వచ్చిన౦దుకు మన కధానాయకుడు చాలా భాధపడటము మొదలు పెట్టాడు .

          ఒకరోజు కధానాయకుడి అన్నగారు కన్పించి కాంతయ్య గారి చెప్పులు వేసుకొని వచ్చావుట కదా అని అడుగుతాడు నిజమే నాని పొరపాటు జరిగిందని ఈసారి బెజవాడ వెళ్ళినప్పుడు ఆయనకు తిరిగి ఇచ్చేస్తానని కధానాయకుడు ఆ న్న గారితో చెపుతాడు అయన,,"జరిగిందేదో జరిగింది,చెప్పులు ఏమి ఇవ్వక్కరలేదు నీవు ఆ ఛాయలకు వెళ్ళకు బెజవాడ వెళ్లిన కాంతయ్యకు అయన మనుషులకు కనిపించకుండా తిరుగు ఎందుకంటే చెప్పులు ఎత్తుకెళ్ళావు అని నీ మీద కోపముగా ఉన్నారట చేయి చేసుకున్నా చేసుకుంటారు జాగ్రత్త పైపెచ్చు నీవు వాళ్లకు పెద్దమనిషి లాగా కనిపించ లేదుట " అని మరి మరి అన్నగారు చెప్పాడు.

          ఇది ఇలా ఉండగా ఒకరోజు డాక్టరుగారు దగ్గరనుంచి ఉత్తరము వచ్చింది అందులో డాక్టరుగారు విజయవాడ  సార్లు వచ్చికూడా మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోవటం ఏమి బాగోలేదని ఈ సారి వచ్చినప్పుడు కలవకపోతే మాట దక్కదు అని నిష్ఠురముగా వ్రాశారు కాబట్టి ఈ సారి విజయవాడ వెళ్లి కాంతయ్య గారికి అయన చెప్పులు ఇచ్చేసి క్షమాపణ చెప్పాలని కథానాయకుడు గారు నిర్ణయించుకున్నాడు. ఒక రోజు కథానాయకుడిని కలవటానికి విజయవాడ నుండి ఎవరో ఒకరు వచ్చారనే సరికి గుండె గుభేలు మంది కంగారుగా వరండాలోకి వచ్చి చూసేసరికి కాంతయ్యగారు కాదు ఇంకెవరో మనిషిబాహుశా కాంతయ్యగారు పంపిన మనిషి అయిఉంటాడు.అనుకోని కథానాయకుడు ," అయ్యా మీరు చెప్పులకోసము వచ్చారా? అని అడిగే సరికి ఆ వచ్చిన వ్యక్తి చెప్పులు ఏమిటండి నన్ను శాస్త్రిగారు పంపించారు అని చెప్పిఒక చిన్న ప్రకటన కాగితము  చేతులో పెట్టాడు. ఆ కాగితము చదివినాక అసలు విషయము గుర్తుకు వచ్చింది ఇంకా నయము ఆ చెప్పులు తీసుకు వచ్చి వచ్చిన అయన ముందు పెట్టలేదు. ఉపన్యాసము ఇవ్వటానికి రెండు గంటల బండిలో వస్తాను ముందు మీరు వెళ్ళండి అంటే ఆ వచ్చినాయన ఒప్పుకోలేదు మిమ్మల్ని తీసుకొనే వెళతాను అని పట్టు బట్టాడు చివరికి ఇద్దరు కలిసి రెండు గంటల బండికి ప్రయాణము అవటానికి నిర్ణయించుకున్నారు. 

          ఆ తరువాత నాలుగు రోజులకు బెజవాడ వెళ్లి రేడియో స్టేషన్ లో పని ముగించుకొని డాక్టరు గారి ఇంటికి వెళ్లి క్షామాపణ చెప్పుకోవాలి అని కథానాయకుడు అనుకోని నడుస్తుంటే ఒక కారు ప్రక్క నుంచి వెళ్లి ఆగి ఆ డ్రైవరు వచ్చి డాక్టరుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే ఇంకా వెళ్ళాక తప్పిందికాదు. ఆయనతో పాటు అయన ఇంటికి తీసుకొని వెళ్లి నాఉత్తరము అందిందా అని ప్రశ్నించాడు కొంప మునిగింది ఇంకా చెప్పుల ప్రస్తావన వస్తుంది అయన అడగక ముందే తానె చెప్తే మర్యాదగా ఉంటుంది అని "చెప్పులు పోయినాయండి" అని అన్నాడు. డాక్టరుగారు ఆశ్చర్యముగా చెప్పులేమిటి అని ప్రశ్నిస్తే కథానాయకుడు తన మనోవ్యధను అంటా పూసగుచ్చినట్లు డాక్టరుగారితో చెప్పుకున్నాడు. అంతావిన్నా డాక్టరుగారు ఆ రోజున కాంతయ్యగారు పొరపాటున వేసుకెళ్లి ఉంటారు పోనీలెండిమల్లి తీసుకువచ్చి ఇవ్వాలా? అయన నాచెప్పులు వేసుకువెళ్ళటము నాభాగ్యము అని అయన ఏంతో  గౌరవంగా అన్నాడు అని డాక్టరు గారు చెప్పారు అనవసరము గా ఆందోళన చెందాను దీనికి కారణము అన్నగారు నాకు చెప్పిన మాటలే కదా అని సమాధానము చెప్పుకున్నాడు. డాక్టరుగారు చెప్పినది అంతా బాగానే ఉన్నది కానీ చీరలో చెప్పిన మాటలు కథా నాయకుడికి భాధ కలిగించాయి అవి ఏమిటి అంటే,"మీరు ఆ విషయాలు మనస్సులో పెట్టుకోకుండా మాములుగా వాస్తు ఉండండి.చెప్పులు కావలిస్తే పట్టుకెళ్లండి "అని డాక్టరుగారు అంటే "నేను ఏమన్నా చెప్పులు ఎత్తుకెళ్ళేవాడినా?"నాకు ఇంత అప్రదిష్ట వచ్చిందా అని బాధపడ్డాడు. పైపెచ్చు అందరు కథానాయకుడిని ఒక విచిత్ర వ్యక్తి లా చూస్తూ ,"మాష్టారు కాస్త మంచి జత చెప్పులు చూసి వేసుకెళ్లండి" అని కధానాయకుడి మీద జోకులు కూడా వేయటం మొదలుపెట్టారు. చెప్పులు తీసుకెళ్లినవాడు గొడుగు కూడా తీసుకెళతాడు అన్న అపవాదు కూడా వచ్చింది పొరపాటు జరిగింది అయినా నన్ను క్షమించకుండా అలా అంటాము అన్యాయముకాదాఅన్న ఈ ప్రశ్నకు కథానాయకుడికి జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.      
 
 

Go Back

వ్యాఖ్య


తాజా వ్యాఖ్యాలు:Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

Ur right

mana andari web magazine chala bagundi. naaku anipinchindi emante deenini oka book form lo articles wise , poems wise , page by page pedithe andaru pustakam chaduvu tunna feeling kalugutundani naa abhiprayam.

Mi kavithalu...adbuthalu... kalyani gaaru

Na kavitha apudu post chestaru

sir,

memu telugu bhasha parirakshna ku ganu writers vari vari abhiprayala nu

A4 paper pai 150 padalanu mincha kunda rasi ( vari photo, 3 lines lo vari

biography) rasi pampandi. a pege lo reight side photo. photo ki left side biograpy) rasi diguvana 150 padalu mincha kunda telugu bhasha pai vari abhiprayam rasi pampithe as it is 200 pages 1/8 size books 1000 print chesi state lo unna anni librarys,schools, ki supply chestam. please send..leda variki ee message nu papmandi..

address... lalithasai charitable trust.(r)
12.15.21, ranigai poola thota,
gavarapalem, anakapalli. vizag dt.
andhra pradesh.

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Displaying comments 1 - 10 of 11 in total